Food and Health

Castor Oil Benifits in Telugu

Castor Oil Benifits :

Castor Oil not only Helps Your Hair Growth—but It Has Tons of Other Beauty Benefits.

జుట్టుకు ఆముదం రాసుకోవడం గురించి తెలిసిందే. సౌందర్య సాధనంగానూ ఇది ఉపయోగపడుతుంది. సహజసిద్ధమైన ఆముదం అందించే చక్కని ఫలితాలెన్నో...

పెదవులు బాగా పొడిబారితే రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఆముదం రాయాలి

కనురెప్పలు రాలిపోతుంటే నిద్రపోయే ముందు కొద్దిరోజులపాటు కాస్త ఆముదం రాస్తే చక్కని ఫలితం ఉంటుంది.

పాదాలు, అరచేతులు గరుగ్గా ఉంటే ఆముదాన్ని రాసి చూడండి. కొన్నిరోజులపాటు ఇలాచేస్తే మృదువుగా మారతాయి.

పిరుదులు, తొడల దగ్గర సాధారణంగా కొవ్వు పేరుకుపోతుంటుంది. కాస్త ఆముదాన్ని వేడిచేసి పడుకోబోయే ముందు ఆయా ప్రాంతాల్లో రాసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.

జుట్టు బాగా ఊడిపోతుంటే కొబ్బరినూనెలో కొద్దిగా ఆముదం కలిపి వేడి చేసి తలకు పట్టించాలి. వారానికోసారి ఇలాచేస్తే జుట్టు ఊడటం తగ్గడమే కాకుండా కురులు నల్లగా నిగనిగలాడతాయి.

ముఖం మీది మచ్చలు, ముడతలను పోగొట్టడానికీ ఆముదం ఎంతగానో తోడ్పడుతుంది.

ఒక్కోసారి వేలికొనల దగ్గర చర్మం పొడిబారి, ఊడిపోతుంటుంది. అలాంటప్పుడు అక్కడ కొద్దిగా ఆముదం రాస్తే కొన్ని రోజులకు మృదువుగా మారుతుంది.

“Life is short. You might as well live it with really great hair.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *